Pageviews past week

Monday, December 27, 2010

ఎన్నాళ్లిలా?

గడియారంలో సెకెన్ల ముల్లు తిరుగుతోంది.
అది ఒక చుట్టు తిరిగాక అప్పడు ‘నా వంతు’ అన్నట్టు నిమిషాల ముల్లు కదులుతుంది.
అలా నిమిషాల ముల్లు తిరుగుతూ ఉంటే దానికంటే నెమ్మదిగా గంటల ముల్లు తిరుగుతుంది.
ఈ మూడు ముళ్లూ మనుషుల్లోని మూడు రకాల మనస్తత్వాలకు ప్రతీకలు.
సెకెన్ల ముల్లు... ఎంతసేపూ చిన్నచిన్న విషయాలకోసం, చిన్నచిన్న ఆదాయాల కోసం చాలా కష్టించి పనిచేసేవారన్నమాట.
వీళ్ల వల్ల కాస్త లాభపడేవారు... నిమిషాల ముల్లు లాంటివాళ్లు.
వీళ్లు  సెకెన్ల ముల్లు కష్టంతో ముందుకెళ్తారన్నమాట. అలాగని వీళ్లు కష్టపడరని కాదు... కాకపోతే వాళ్లకంటే తక్కువ పని, ఎక్కువ గుర్తింపు వీళ్లకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సెకెన్ల ముల్లు లేకపోతే నిమిషాల ముల్లు లేదు.
ఇక, గంటల మల్లు... వాళ్లిద్దరికంటే తక్కువ పని, మరింత గుర్తింపు, ఎక్కువ సంపాదనా ఉంటాయి ఇలాంటి వాళ్లకి.
వీరిలో మీరు ఏ కోవకు చెందుతారో ఆలోచిస్తున్నరా?
లేక
‘వీరిలో మీరు ఏ కోవకు చెందుతారో ఆలోచించుకోండి’ అంటాననుకుంటున్నారా?
అవేంకాదు....
వీళ్ల ముగ్గురికంటే ఎక్కువ సంపాదించేవాళ్లూ.... అది కూడా వీళ్ల ముగ్గురి సాయంతోనే సంపాదించేవాళ్లూ మరో రకం ఉన్నారు.
వాళ్లే గడియారానికి కీ ఇచ్చేవాళ్లు లేదా బ్యాటరీ వేసేవాళ్లు.
సెకెన్లూ, నిమిషాలూ, గంటల ముళ్లతో పనిచేయించి తమ ‘టైం’ మార్చుకునేవారన్నమాట.
‘అంటే... వేరొకరితో పనిచేయించుకుని వాళ్ల పొట్ట కొట్టేవాళ్లా’ అనుకుంటున్నారా?
కాదు...
వాళ్లకు పని కల్పించి తద్వారా తామూ సంపాదించేవాళ్లు. వాళ్ల కంటే ఎక్కువ సంపాదించేవాళ్లు.
ఒక్కమాటలో చెప్పాలంటే సెకెన్ల ముల్లు ‘సామాన్యుడి’కి ప్రతీక.
ఇప్పుడు చెప్పండి.... మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు?
ఏంటీ... వాచ్ చూసుకుంటున్నరా?
ఫర్వాలేదు... సమయం మించిపోలేదు.

No comments:

Post a Comment