Pageviews past week

Thursday, December 30, 2010

శ్రీవారికి ఉప్పు లడ్డు

ఉప్పు కలిపిన రొట్టెలను ‘ఎంతో రుచిరా...’ అని రామదాసుతోనే  తినిపించినవాడు...
అలాంటి మహానుభావుడికి ఉప్పు కలిపిన లడ్లు ఓ లెక్కా.
అనుకున్నారో ఏమో... తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి
ఏకంగా ఉప్పు గుండ కలిపిన లడ్డూలే చెల్లించారట.
కలికాలం శ్రీవారికి కూడా తప్పలేదు.
అయినా ఆయనకు ఇది కొత్తా

Wednesday, December 29, 2010

కొత్త ఏడాదిలో...

వచ్చేస్తోంది వచ్చేస్తోంది 2011
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ ఏడాదిలో నేను పాటించే రెండు ముఖ్యమైన సూత్రాలు
డబ్బును ఆదాచేయడం... బరువు పెరగకుండా చూసుకోవడం
మంచివేనంటారా?
అయితే మీరూ పాటించండి మరి

Monday, December 27, 2010

ఎన్నాళ్లిలా?

గడియారంలో సెకెన్ల ముల్లు తిరుగుతోంది.
అది ఒక చుట్టు తిరిగాక అప్పడు ‘నా వంతు’ అన్నట్టు నిమిషాల ముల్లు కదులుతుంది.
అలా నిమిషాల ముల్లు తిరుగుతూ ఉంటే దానికంటే నెమ్మదిగా గంటల ముల్లు తిరుగుతుంది.
ఈ మూడు ముళ్లూ మనుషుల్లోని మూడు రకాల మనస్తత్వాలకు ప్రతీకలు.
సెకెన్ల ముల్లు... ఎంతసేపూ చిన్నచిన్న విషయాలకోసం, చిన్నచిన్న ఆదాయాల కోసం చాలా కష్టించి పనిచేసేవారన్నమాట.
వీళ్ల వల్ల కాస్త లాభపడేవారు... నిమిషాల ముల్లు లాంటివాళ్లు.
వీళ్లు  సెకెన్ల ముల్లు కష్టంతో ముందుకెళ్తారన్నమాట. అలాగని వీళ్లు కష్టపడరని కాదు... కాకపోతే వాళ్లకంటే తక్కువ పని, ఎక్కువ గుర్తింపు వీళ్లకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సెకెన్ల ముల్లు లేకపోతే నిమిషాల ముల్లు లేదు.
ఇక, గంటల మల్లు... వాళ్లిద్దరికంటే తక్కువ పని, మరింత గుర్తింపు, ఎక్కువ సంపాదనా ఉంటాయి ఇలాంటి వాళ్లకి.
వీరిలో మీరు ఏ కోవకు చెందుతారో ఆలోచిస్తున్నరా?
లేక
‘వీరిలో మీరు ఏ కోవకు చెందుతారో ఆలోచించుకోండి’ అంటాననుకుంటున్నారా?
అవేంకాదు....
వీళ్ల ముగ్గురికంటే ఎక్కువ సంపాదించేవాళ్లూ.... అది కూడా వీళ్ల ముగ్గురి సాయంతోనే సంపాదించేవాళ్లూ మరో రకం ఉన్నారు.
వాళ్లే గడియారానికి కీ ఇచ్చేవాళ్లు లేదా బ్యాటరీ వేసేవాళ్లు.
సెకెన్లూ, నిమిషాలూ, గంటల ముళ్లతో పనిచేయించి తమ ‘టైం’ మార్చుకునేవారన్నమాట.
‘అంటే... వేరొకరితో పనిచేయించుకుని వాళ్ల పొట్ట కొట్టేవాళ్లా’ అనుకుంటున్నారా?
కాదు...
వాళ్లకు పని కల్పించి తద్వారా తామూ సంపాదించేవాళ్లు. వాళ్ల కంటే ఎక్కువ సంపాదించేవాళ్లు.
ఒక్కమాటలో చెప్పాలంటే సెకెన్ల ముల్లు ‘సామాన్యుడి’కి ప్రతీక.
ఇప్పుడు చెప్పండి.... మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు?
ఏంటీ... వాచ్ చూసుకుంటున్నరా?
ఫర్వాలేదు... సమయం మించిపోలేదు.

కాసేపు ఆగండి

మనం రోజూ ఎన్నో వ్యక్తిత్వ వికాస పాఠాలు చదువుతుంటాం. ఇలా చేయాలని అనుకుంటాం. ఆ పుస్తకం చదవడం అయిపోయాకో టీవీ చూసేసిన తరవాతో ఆ విషయాన్ని మరచిపోతాం.
ఒక్కసారి మీరు చదివిన పాయింట్ దగ్గర ఆగండి.
ఉదాహరణకు ‘మీరు బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు... మీకు రిలీఫ్ ని ఇచ్చేది ఏదో తెలుసుకుని ఆ పనిచేయండి. సంగీతం వినడం, పాత సినిమాలు చూడటం, చిన్న పిల్లలతో ఆడటం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం... ఇలాంటివి చేయండి’ అని చదువుతాం. కానీ,  ఒత్తిడిలో ఉన్నప్పుడు వీటిలో ఏ ఒక్కదాన్నయినా చేసేవాళ్లు మనలో ఎంతమంది ఉంటారు?
అందుకే అలాంటి విషయాలు చదివినప్పుడు కాసేపు అక్కడ ఆగండి.  మీకు నిజంగా ఉత్తేజకంగా అనిపించేదేదో ఆలోచించుకోండి. అలాంటివి సిద్ధం చేసుకోండి. ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందండి.

Saturday, December 25, 2010

ఈ రోజే పుట్టింది నా బ్లాగు

హాయ్ ఫ్రెండ్స్... నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశానోచ్. మిగతా విషయాలు బ్రేకు తరవాత...
అంటే సోమవారం అన్నమాట.