Pageviews past week

Sunday, January 2, 2011

కొత్త అలవాట్లు

2011 వచ్చేసింది.
ఎంతోమంది కొత్త సంవత్సరంలో చేయాలని ఎన్నో పనుల జాబితా తయారుచేసుకున్నారు.
కొందరు ఇప్పటికే కొన్ని ప్రారంభించారు కూడా.
కొత్త రౌతుకు గుర్రం అంత తొందరగా అలవాటవుతుందా?
ఇదీ అంతే.
ఇందుకోసం నేను కొన్ని చిట్కాలు చెబుతాను.
1. చిన్న చిన్న కొత్త అలవాట్లు ఏర్పరచుకోండి. వాటిని అనుసరించడానికి ప్రయత్నించండి. అందుకోసం చిన్న చిన్న త్యాగాలు చేయండి. ఉదాహరణకు రాత్రిపూట పడుకునేముందు  పుస్తకాలు చదువుతాను అనుకున్నారనుకోండి. ఇందుకు ప్రధాన అడ్డంకి టీవీ. కాదంటారా?
ముందు టీవీ చూడటానికి ఫుల్ స్టాప్ పెట్టగలిగితే పుస్తకం తీయాలన్న ఆలోచన వస్తుంది. పుస్తకం చదువుతుంటే నిద్ర అదే వచ్చేస్తుంది. అదే టీవీ చూస్తుంటే... ఆ ప్రోగ్రామ్ అయ్యేవరకూ కూర్చుంటాం. సో... పుస్తకం చదవడం వల్ల వేగంగా నిద్రపోయే అవకాశం కూడా ఉందన్నమాట.
త్వరగా నిద్రపోతే... త్వరగా నిద్రలేస్తాం. అంటే... రోజులో ఎక్కువ భాగం మీ చేతుల్లో ఉంటుంది. నో కంగారు... నో హర్రీబర్రీ.
పనులన్నీ ప్రశాంతంగా ప్రణాళికతో చేసుకోవచ్చు.
మరికొన్ని చిట్కాలు తరవాతి పోస్టులో.

1 comment: